icon icon icon
icon icon icon

సొంత పార్టీ నేతపై ‘విమర్శ’

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు.

Published : 06 May 2024 04:35 IST

గందరగోళానికి గురైన కంగన

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. ప్రత్యర్థి పార్టీ నేతకు బదులుగా సొంత పార్టీ నేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ నేతలిద్దరి పేర్లలోని మొదటి పదం తేజస్వీ కావడమే అందుకు కారణం. మండీ నియోజకవర్గంలోని సుందర్‌నగర్‌లో శుక్రవారం నాటి ఎన్నికల ప్రచారంలో ఆమె.. కాంగ్రెస్‌తో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు. ‘‘అవినీతిపరుల పార్టీ ఇక్కడ ఉంది. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్‌ గాంధీ, రౌడీయిజం చేసి.. చేపలు తినే తేజస్వీ సూర్య ఇందులో ఉన్నారు’’ అని అన్నారు. వాస్తవానికి ఆమె ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను విమర్శించాలనుకున్నారు. అయితే బెంగళూరు సౌత్‌ భాజపా అభ్యర్థి తేజస్వీ సూర్య పేరును ప్రస్తావించారు. కంగనాకు సంబంధించిన ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన తేజస్వీ యాదవ్‌.. ఈమె ఎవరు? అంటూ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img