icon icon icon
icon icon icon

కేజ్రీవాల్‌ గొంతు నొక్కేయడానికే అరెస్టు

ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Published : 06 May 2024 04:35 IST

నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి: సునీత

దిల్లీ: ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో   ‘నియంతృత్వానికి’ వ్యతిరేకంగా ఓటేయాలని ఆమె దిల్లీ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆమె దక్షిణ దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘నా భర్త దిల్లీలో మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించారు. మహిళలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఆయనను అరెస్టు చేశారు’’ అని ఆరోపించారు. మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికకావడం ప్రత్యర్థుల్లో కలవరం కలిగిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img