icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా

కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు.

Published : 06 May 2024 04:38 IST

అయోధ్య రామమందిర దర్శనాన్ని పార్టీ నేతలు వ్యతిరేకించారని ఆరోపణ

దిల్లీ: కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు. దీనివల్ల ఛత్తీస్‌గఢ్‌లోని పార్టీ కార్యాలయంలోనికి తనను అనుమతించలేదని చెప్పారు. దీనిపై పార్టీ అగ్రనేతలకు  ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిన రాజీనామా లేఖలో రాధిక పేర్కొన్నారు. ‘‘మతాన్ని సమర్థించేవారికి వ్యతిరేకత ఎదురవుతుందని పురాతన కాలం నుంచి స్పష్టమవుతోంది. దీనిపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. అదేరీతిలో.. శ్రీరాముడి పేరును జపించినవారిని ప్రస్తుతం కొందరు వ్యతిరేకిస్తున్నారు. హిందువులందరికీ రాముడి జన్మస్థలం పరమపవిత్రమైంది. రామ్‌ లల్లా దర్శనంతో తమ జీవితం ధన్యమైందని ఈ మతస్థులు భావిస్తారు. కొందరు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు’’ అని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img