icon icon icon
icon icon icon

గుజరాత్‌లో ‘గాంధీ’ వ్యూహం..!

రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్‌లో నవ్సారీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు.

Published : 06 May 2024 04:56 IST

నవ్సారీలో కాంగ్రెస్‌ అభ్యర్థి వినూత్న ప్రచారం

నవ్సారీ (గుజరాత్‌): రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్‌లో నవ్సారీ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. అదే ‘గాంధీ’ వ్యూహం. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే గుండు గీయించుకున్నారు. మహాత్మాగాంధీ వస్త్రధారణను అనుకరించడం ప్రారంభించారు. నామినేషన్‌ వేసేందుకు కూడా ఊతకర్రతోనే బయల్దేరారు. ఆయనే 68 ఏళ్ల నైషద్‌ దేశాయ్‌. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, న్యాయవాది. ధనబలం కలిగిన భాజపా ప్రత్యర్థిని ఎదుర్కొవాలంటే తనకు గాంధీ అందించిన స్ఫూర్తి తప్ప మరో మార్గం లేదంటున్నారు. ‘‘అహ్మదాబాద్‌ నుంచి దండికి గాంధీ చేసిన చారిత్రక ఉప్పు సత్యాగ్రహాన్ని తలపించేలా నియోజకవర్గంలో యాత్రలు చేస్తున్నా. గాంధేయ భావాలను ప్రచారం చేస్తున్నా’’ అని దేశాయ్‌ తెలిపారు. తనకు ధనబలం లేదని..అందుకే ఈ వేషధారణతో రోజుకు 200 నుంచి 300 మంది కార్యకర్తలతో పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం యాత్రను ముగించిన దండి ప్రాంతం కూడా నవ్సారీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా..? ఎందుకంటే నవ్సారీ భాజపా కంచుకోట. ఇక్కడ 2019లో భాజపా అభ్యర్థి సి.ఆర్‌.పాటిల్‌ 6.9 లక్షల ఓట్లతో నెగ్గారు. ఇది ఆ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img