icon icon icon
icon icon icon

అక్కడ కాంగ్రెస్‌ ఓటు ‘నోటా’కే!

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 07 May 2024 04:39 IST

ఇందౌర్‌లో అభ్యర్థి వైదొలగడంతో మారిన ప్రచార వ్యూహం

ఇందౌర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌ లోక్‌సభ స్థానంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని భాజపా ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం. ఇందౌర్‌ స్థానానికి ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీ చేస్తుండగా.. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ మాత్రం చివరి క్షణంలో (ఏప్రిల్‌ 29న) నామినేషన్‌ ఉపసంహరించుకుని భాజపాలో చేరారు. దాంతో అక్కడ కాంగ్రెస్‌ పోటీలో లేకుండా పోయింది. ఆకస్మిక పరిణామంతో నిర్ఘాంతపోయిన కాంగ్రెస్‌ నెమ్మదిగా కోలుకొని ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేస్తోంది. తద్వారా భాజపాకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img