icon icon icon
icon icon icon

మీలాగే నేనూ ఆస్వాదించా

లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో క్షణం తీరికలేకుండా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఆకర్షించింది.

Published : 07 May 2024 04:40 IST

తాను నృత్యం చేస్తున్నట్లు రూపొందించిన యానిమేటెడ్‌ వీడియోకు ప్రధాని ప్రశంస

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో క్షణం తీరికలేకుండా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఆకర్షించింది. జనాలతో కిక్కిరిసిపోయిన మైదానంలో వేదికపై మోదీ ఓ హుషారైన పాటకు నృత్యం చేస్తుండగా, జనాలు కేరింతలు కొడుతూ ఊగిపోతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ఈ వీడియోను పోస్ట్‌ చేయడం వల్ల నియంత నన్ను అరెస్టు చేయించరని భావిస్తున్నందునే పోస్టు చేస్తున్నాను’’ అని వీడియోను పోస్ట్‌ చేసిన ట్విటర్‌ హ్యాండిల్‌లో సందేశం కనిపించింది. ఈ ట్వీట్‌ను రీ పోస్ట్‌ చేసిన మోదీ ‘‘మీ అందరి లాగానే.. నా నృత్యాన్ని నేనూ ఆస్వాదించాను. ఎన్నికలు కీలక దశలో ఉన్న సమయంలో ఇటువంటి సృజనాత్మకత నిజంగా సంతోషాన్నిస్తుంది’’ అన్న సందేశాన్ని జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img