icon icon icon
icon icon icon

ఒడిశాలో కమల వికాసం ఖాయం

‘‘ఒడిశాలో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అస్తమించే సూర్యుడు. కాంగ్రెస్‌ ఎప్పుడో కొట్టుకుపోయింది.

Published : 07 May 2024 05:41 IST

బ్రహ్మపుర/నవరంగపూర్‌: ‘‘ఒడిశాలో బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అస్తమించే సూర్యుడు. కాంగ్రెస్‌ ఎప్పుడో కొట్టుకుపోయింది. రాష్ట్ర ప్రజలకు మిగిలిన ఒకే ఒక వెలుగురేఖ అయిన భాజపా ఆశల కొత్త సూర్యుడిలా ఉదయిస్తోంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం ఒడిశాలోని బ్రహ్మపుర, నవరంగపూర్‌ సభల్లో ప్రధాని మాట్లాడారు. నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ సర్కారు గడువు తేదీ జూన్‌ 4  అని ప్రకటించిన మోదీ.. జూన్‌ 10న రాష్ట్రంలో జరిగే భాజపా సీఎం ప్రమాణస్వీకారానికి అందరినీ ఆహ్వానించడానికే తాను వచ్చానన్నారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమాంతరంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img