icon icon icon
icon icon icon

ప్రజ్వల్‌లాంటి వారిని సహించకూడదు

కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్‌) ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణలాంటి వారిని సహించకూడదని ప్రధాని మోదీ చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి మనదేశం దాటి వెళ్లిపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారే కారణమని ఆరోపించారు.

Published : 07 May 2024 05:43 IST

ఆ ఎంపీ దేశం దాటి వెళ్లడానికి కర్ణాటక ప్రభుత్వమే కారణం: మోదీ

దిల్లీ: కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్‌) ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణలాంటి వారిని సహించకూడదని ప్రధాని మోదీ చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి మనదేశం దాటి వెళ్లిపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారే కారణమని ఆరోపించారు. వక్కలిగల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజ్వల్‌కు సంబంధించిన వీడియోలను పెద్దఎత్తున విడుదల చేయడం వెనుక కర్ణాటక ప్రభుత్వ హస్తం ఉందన్నారు. ‘టైమ్స్‌ నౌ’ ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తీవ్ర ఆరోపణలపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అది శాంతిభద్రతల అంశం. కాంగ్రెస్‌తో జేడీ(ఎస్‌) పొత్తు ఉన్న సమయంలో ఘటనలన్నీ జరిగినట్లు వీడియోలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వీడియోలను సమకూర్చుకుని, ఇప్పుడు వక్కలిగలు ఓట్లు వేసిన తర్వాత వాటిని బయటపెడుతున్నారు. అది కూడా నిందితుడు విదేశాలకు వెళ్లాక..! ఇదంతా అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంటే ఎంపీపై ఒక కన్నువేసి, విమానాశ్రయాలపైనా నిఘా ఉంచాలిగా? అప్పుడు ఏమీ చేయకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా వదిలేయడాన్ని చూస్తే ఇదంతా రాజకీయ క్రీడ అని స్పష్టమవుతోంది. అయినా- ఇదంతా నాకు సంబంధించినది కాదు. దోషులెవరినీ విడిచిపెట్టకూడదనేదే నా ఉద్దేశం. ఇలాంటి ఆటలకు అడ్డుకట్టపడాలి. చట్టపరంగా అన్ని అవకాశాలూ ఉపయోగించుకుని కఠినశిక్ష పడేలా చేయాలి’ అని ప్రధాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img