icon icon icon
icon icon icon

నకిలీ వీడియోలను తొలగించండి

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న నకిలీ వీడియోలు, అసత్య ప్రచారాలపై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్ర చేసింది.

Updated : 07 May 2024 05:48 IST

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై ఈసీ హుకుం

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోన్న నకిలీ వీడియోలు, అసత్య ప్రచారాలపై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్ర చేసింది. సంబంధిత ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన వెంటనే 3 గంటల్లోగా వాటిని తొలగించాలంటూ నిర్ణీత వ్యవధిని నిర్దేశించింది. దీనికి ఆ పార్టీలో బాధ్యులెవరో గుర్తించి, హెచ్చరించాలని తెలిపింది. అవతలి పక్షం వ్యక్తులను అనుకరించడం, అవహేళన చేసేలా వీడియోలను మార్ఫింగ్‌ చేయడం తగదని పేర్కొంది. సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి బాధ్యతాయుతంగా, నైతికంగా వినియోగించుకోవాలని హితవు పలికింది. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకుని డీప్‌ఫేక్‌ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారానికి దిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు, ప్రచారకర్తలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న ఘటనలను ఈ సందర్భంగా ఈసీ ఉదహరించింది. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంపొందించేలా అన్ని రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img