icon icon icon
icon icon icon

చొరబాట్లను అరికడతాం

పశ్చిమబెంగాల్‌ ఎదుర్కొంటున్న చొరబాట్ల ముప్పును భాజపా అరికడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Published : 07 May 2024 05:47 IST

10 ఏళ్లుగా ఉగ్రవాదంపై కఠినవైఖరి అవలంబించాం
కృష్ణానగర్‌, దుర్గాపుర్‌ ర్యాలీల్లో అమిత్‌ షా

కృష్ణానగర్‌, దుర్గాపుర్‌, సమస్తీపుర్‌ : పశ్చిమబెంగాల్‌ ఎదుర్కొంటున్న చొరబాట్ల ముప్పును భాజపా అరికడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. రాష్ట్రంలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎప్పటికీ ఆ పని చేయబోదని విమర్శించారు. కృష్ణానగర్‌లోని భాజపా అభ్యర్థిని తప్పకుండా గెలిపించాలని స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రజల మద్దతు, ఆదరణ చూస్తుంటే తమ అభ్యర్థి విజయం ఖాయంలా కనిపిస్తోందని పేర్కొన్నారు. కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానంలోని బెల్దంగా మోర్‌ నుంచి సోమవారం అమిత్‌ షా భారీ రోడ్‌ షో నిర్వహించారు.  కృష్ణానగర్‌లో భాజపా తరఫున రాజమాత అమృతారాయ్‌, టీఎంసీ నుంచి సిటింగ్‌ ఎంపీ మహువా మొయిత్రా పోటీ పడుతున్నారు. బర్ధమాన్‌-దుర్గాపుర్‌ నియోజకవర్గంలోని దుర్గాపుర్‌లో ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా ప్రసంగిస్తూ‘యూపీఏ హయాంలో జరిగిన ఉగ్రదాడులపై కాంగ్రెస్‌, టీఎంసీలు నిశ్శబ్దం పాటించాయి.  వారి ఓటు బ్యాంకులకు నష్టం వాటిల్లుతుందనే భయమే అందుకు కారణం’ అని ఆక్షేపించారు. గడచిన 10 ఏళ్ల భాజపా నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించామన్నారు. విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వాములైన కాంగ్రెస్‌, ఆర్జేడీలకు అధికారం అప్పగిస్తే దేశంలో ఆటవిక పాలన మొదలవుతుందని అమిత్‌ షా విమర్శించారు.  బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో అమిత్‌ షా సోమవారం ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img