icon icon icon
icon icon icon

ఇకపై పోలింగ్‌ శాతాన్ని ఎప్పటికప్పుడే తెలుసుకోవచ్చు

తొలి, రెండో విడతల పోలింగ్‌ వివరాలను వెల్లడించడంలో ఈసీ జాప్యం చేసిందంటూ విపక్షాలు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది.

Published : 07 May 2024 05:50 IST

ఓటర్‌ టర్నవుట్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించిన ఈసీ

దిల్లీ: తొలి, రెండో విడతల పోలింగ్‌ వివరాలను వెల్లడించడంలో ఈసీ జాప్యం చేసిందంటూ విపక్షాలు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై దశల వారీగా జరగనున్న ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని సమగ్రంగా తెలిపే ఫీచర్‌ను తన ‘ఓటర్‌ టర్నవుట్‌’ మొబైల్‌ యాప్‌లో జోడించినట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్‌ జరిగే రోజున సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటువేసిన వారి సంఖ్యను అప్‌డేట్‌ చేస్తామని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు పోలింగ్‌ శాతాన్ని తెలుపుతామని పేర్కొంది. ఇది కచ్చితమైన సమాచారం అవసరమయ్యే మీడియా, ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img