icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట నిలిపి ఉంచిన కార్లు ధ్వంసం

తమ పార్టీ కార్యాలయం బయట పార్కింగ్‌ చేసిన డజనుకు పైగా కార్లను కొందరు దుండగులు ధ్వంసం చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 07 May 2024 05:51 IST

అమేఠీ జిల్లాలో ఘటన

అమేఠీ: తమ పార్టీ కార్యాలయం బయట పార్కింగ్‌ చేసిన డజనుకు పైగా కార్లను కొందరు దుండగులు ధ్వంసం చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ జిల్లా గౌరీగంజ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కార్లలో కూర్చున్న కొందరికి గాయాలయ్యాయని కాంగ్రెస్‌ నేత ఒకరు సోమవారం వెల్లడించారు.  ‘ఈ దాడి వెనుక ఉన్నది భాజపానే. ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం’ అని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img