icon icon icon
icon icon icon

భాజపాలోకి రాధికా ఖేడా

కాంగ్రెస్‌ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్‌ సుమన్‌ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే, జాతీయ మీడియా విభాగం ఇన్‌ఛార్జి అనిల్‌ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

Published : 08 May 2024 04:52 IST

నటుడు శేఖర్‌ సుమన్‌ కూడా..

దిల్లీ: కాంగ్రెస్‌ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్‌ సుమన్‌ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే, జాతీయ మీడియా విభాగం ఇన్‌ఛార్జి అనిల్‌ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ రాధికా ఖేడా ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన శేఖర్‌ సుమన్‌ భాజపా అభ్యర్థి శత్రుఘ్న సిన్హా చేతిలో ఓడిపోయారు. అనంతరం 2012లో ఆయన కాంగ్రెస్‌ను వీడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img