icon icon icon
icon icon icon

మేనల్లుడిపై మాయావతి వేటు

తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు.

Published : 08 May 2024 04:53 IST

లఖ్‌నవూ: తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు. యువనేతకు పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు  మంగళవారం రాత్రి ప్రకటించారు. కేవలం ఐదు నెలల్లోనే ఆయన పదవి కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మాయావతి తెలిపారు. తన సోదరుడు (ఆకాశ్‌ తండ్రి) ఆనంద్‌కుమార్‌ ఇంతకుముందు మాదిరిగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img