icon icon icon
icon icon icon

ముస్లింలకు వ్యతిరేకం కాను : మోదీ

ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు.

Updated : 08 May 2024 06:38 IST

దిల్లీ: ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు. ‘‘నెహ్రూ కాలం నుంచే వారు (విపక్షాలను ఉద్దేశించి) మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా చూపించి.. మైనార్టీలపై కపటప్రేమను ప్రదర్శిస్తున్నారు. ఇపుడు ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనను అర్థం చేసుకోవడంలో నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని అర్థం చేసుకున్నారు’’ అన్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ముస్లిం వర్గానికి మోదీ పిలుపునిచ్చారు.

3వ విడతతో విపక్షం ఆశలు ఆవిరి

లోక్‌సభ ఎన్నికల మూడోవిడత పోలింగు మంగళవారం సాయంత్రం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘‘విపక్షం ఆశలు మరింతగా ఆవిరైపోయాయి. వారి తిరోగమన ఆర్థిక విధానాలు, పాతకాలం నాటి ఓటుబ్యాంకు రాజకీయాలే ఇందుకు కారణం’’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే అభివృద్ధి అజెండాను నమ్మిన ఓటర్లకు కృతజ్ఞతలని ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img