icon icon icon
icon icon icon

జీఎస్టీని సవరిస్తాం.. అగ్నివీర్‌ను రద్దుచేస్తాం

సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్‌ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు.

Updated : 08 May 2024 06:33 IST

రాజ్యాంగ రక్షణకు ప్రాణత్యాగాలకైనా సిద్ధం
ఝార్ఖండ్‌ ప్రచారంలో రాహుల్‌గాంధీ వెల్లడి

గుమ్లా, చాయీబాసా: సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్‌ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. మోదీ కొద్దిమంది కోటీశ్వరుల కోసమే పనిచేస్తారని, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక కోట్లమందిని లక్షాధికారుల్ని చేస్తుందని చెప్పారు. మంగళవారం ఆయన ఝార్ఖండ్‌లోని చాయీబాసా, గుమ్లా సభల్లో ప్రసంగించారు. రాజ్యాంగంతో పాటు గిరిజనులు, పేదలు, బీసీలను, రక్షించేందుకు ఇండియా కూటమి నేతలు ప్రాణత్యాగాలకూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

గిరిజనుల్ని భాజపా ఎదగనివ్వదు

‘‘గిరిజనులకు చెందాల్సిన భూములు, జలాలు, అడవులను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. అదానీ, అంబానీల కోసమే ఆయన పనిచేస్తారు. పదేళ్ల పదవీకాలంలో 22 మందిని ఆయన బిలియనీర్లుగా చేశారు. మేం పేద మహిళలను గుర్తించి, వారికి నెలకు రూ.8,500 వంతున.. ఏటా రూ.లక్ష అందిస్తూ లక్షాధికారుల్ని చేస్తాం. ఇళ్లలో పనివారి పాత్రకే గిరిజనుల్ని పరిమితం చేయాలని భాజపా కోరుకుంటుంది. దేశాన్ని నడిపే 90 మంది ఐఏఎస్‌ అధికారుల్లో గిరిజనుడు ఒకరే ఉన్నారు. ఆయనకీ అప్రాధాన్య పోస్టు ఇచ్చారు.  మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50% పైబడి ఉండేలా రిజర్వేషన్లను పెంచుతుంది’’ అని రాహుల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img