icon icon icon
icon icon icon

ఏడోదశ ఎన్నికలకు నోటిఫికేషన్‌

సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్‌సభ స్థానాల్లో జూన్‌ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Published : 08 May 2024 04:54 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్‌సభ స్థానాల్లో జూన్‌ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం- చండీగఢ్‌లో ఈ స్థానాలు విస్తరించి ఉన్నాయి. ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నియోజకవర్గం కూడా ఈ దశలోనే పోలింగుకు వెళ్లనుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఉపసంహరణకు ఈ నెల 17 వరకు అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img