icon icon icon
icon icon icon

ముస్లిం రిజర్వేషన్లకు నేను అనుకూలం : లాలూ

ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు.

Published : 08 May 2024 04:55 IST

పట్నా: ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. అవి సామాజిక వెనకబాటుననుసరించి ఉండాలి తప్ప మతం ఆధారంగా ఉండకూడదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లను ఎత్తేయాలని కోరుకుంటోందని ఆరోపించారు. మంగళవారం తన భార్య రబ్రీదేవి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే బిహార్‌ సీఎం నితీశ్‌ సహా మొత్తం 11మంది మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img