icon icon icon
icon icon icon

అబద్ధాలాడే వారిని తిరస్కరించండి: సోనియా

అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated : 08 May 2024 06:31 IST

దిల్లీ: అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బలమైన, మరింత ఐక్యత ఉన్న, శాంతియుత, సామరస్య భారతదేశాన్ని నిర్మించేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల మూడోదశ నేపథ్యంలో మంగళవారం ఆమె ఈ మేరకు వీడియో సందేశం వెలువరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌, ఇండియా కూటమి కట్టుబడి ఉంటాయని చెప్పారు. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులపై వివక్ష వంటివి మునుపెన్నడూలేనంత స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తపరిచారు. సమాజాన్ని ముక్కలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనకెంతో వేదన కలిగిస్తున్నాయన్నారు.

కేవలం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకే కాకుండా రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడుకోవాలా, దేశం నియంతృత్వంవైపు నడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అనేది తేల్చేందుకు పెద్దసంఖ్యలో స్పందించి ఓటుహక్కు వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’ ద్వారా కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img