icon icon icon
icon icon icon

పాకిస్థాన్‌ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు

పాకిస్థాన్‌ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది.

Published : 08 May 2024 05:42 IST

భాజపా వ్యాఖ్య

దిల్లీ: పాకిస్థాన్‌ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది. ‘‘ఫరూక్‌ అబ్దుల్లా, లాలూ ప్రసాద్‌ తదితరుల ప్రకటనలు చూస్తుంటే.. పాక్‌ను సంతోషపెట్టే నాయుకుడినా లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను ఎన్నుకోవాలా అన్న విషయాన్ని ఓటర్లు పోలింగ్‌ సమయంలో సహజంగానే ఆలోచిస్తారు’’ అని భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే దిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో వ్యాఖ్యానించారు. పార్టీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ..ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చేసి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img