icon icon icon
icon icon icon

అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది

‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు.

Published : 08 May 2024 05:42 IST

ప్రధాని పెద్దన్న సోమాభాయీ మోదీ

అహ్మదాబాద్‌: ‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్దన్న అయిన ఈయన గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధి రానీప్‌ ప్రాంత పోలింగ్‌ బూత్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఇదే బూత్‌లో ప్రధాని తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఈ సందర్భంగా కలుసుకొన్న సోదరులు ఇద్దరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మోదీ గాంధీనగర్‌లో ఓటుహక్కు వినియోగించుకోడానికి వచ్చిన ప్రతిసారీ స్థానికంగా ఉన్న తన తల్లి హీరాబా ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకునేవారు. దాదాపు వందేళ్ల వయసులో 2022 డిసెంబరులో ఆమె మృతిచెందిన విషయం తెలిసిందే. తల్లిని తలచుకొని భావోద్వేగానికి గురైన సోమాభాయీ ‘‘ఈ ప్రాంతానికి చెందిన అందరిలా నేను కూడా నరేంద్ర మోదీ మూడోసారి మళ్లీ ప్రధాని కావాలని కోరుకొంటున్నా’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img