icon icon icon
icon icon icon

ముస్లింల రిజర్వేషన్‌పై కార్టూన్‌ వీడియో.. భాజపా నేతలు నడ్డా, మాల్వియాలకు నోటీసులు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాల్వియాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Updated : 09 May 2024 05:54 IST

ఈనాడు, బెంగళూరు: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాల్వియాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముస్లింల రిజర్వేషన్‌పై ‘ఎక్స్‌’లో భాజపా పోస్టు చేసిన కార్టూన్‌ వీడియోపై వివరణ ఇచ్చేందుకు వారం రోజుల్లో బెంగళూరు నగరంలోని హైగ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని సూచించారు. వీడియోను వెంటనే తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సైతం మంగళవారం ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలో సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ వ్యంగ్య చిత్రాలతో పాటు వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ముస్లింలకు రిజర్వేషన్‌ పెంచటం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్న సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోందని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img