icon icon icon
icon icon icon

ముంగేర్‌ ఆర్జేడీ లోక్‌సభ అభ్యర్థికి లేటు వయసులో ‘ఎన్నికల’ పెళ్లి!

ఒక కరడుగట్టిన నేరగాడి ఆగడాలు.. పోలీసులు అతణ్ని పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా రాసిన ‘బిహార్‌ డైరీస్‌’ పుస్తకం ఆధారంగా ‘ఖాకీ’ వెబ్‌సిరీస్‌ నిర్మించారు.

Published : 09 May 2024 05:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక కరడుగట్టిన నేరగాడి ఆగడాలు.. పోలీసులు అతణ్ని పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా రాసిన ‘బిహార్‌ డైరీస్‌’ పుస్తకం ఆధారంగా ‘ఖాకీ’ వెబ్‌సిరీస్‌ నిర్మించారు. ఈ కథలోని అసలు పాత్రే అశోక్‌ మహతో. సుదీర్ఘకాలం జైలుజీవితం గడిపిన ఇతడికి విడుదలైన తర్వాత పార్లమెంటుకు వెళ్లాలన్న కోరిక పుట్టింది. బిహార్‌లోని ముంగేర్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. అయితే, నిబంధనలు అడ్డురావడంతో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ను సంప్రదించాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకు టికెటు ఇస్తామని లాలూ చెప్పారు. అంతే.. 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను మహతో పెళ్లాడాడు. ఇచ్చిన మాట ప్రకారం అనితా మహతోకు ఆర్జేడీ  ముంగేర్‌ లోక్‌సభ టికెటు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img