icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో విలీనంపై పవార్‌ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమే

మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మరింత సన్నిహితం కావచ్చు లేదా విలీనం కావచ్చని ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాములైన ఆప్‌, సీపీఐ బుధవారం స్పందించాయి.

Published : 09 May 2024 05:06 IST

 ఆప్‌, సీపీఐ స్పందన 

దిల్లీ: మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మరింత సన్నిహితం కావచ్చు లేదా విలీనం కావచ్చని ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాములైన ఆప్‌, సీపీఐ బుధవారం స్పందించాయి. శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు ఆయన రాజకీయ బలహీనతను సూచిస్తున్నాయని, కుమార్తె సుప్రియా సూలే బరిలో ఉన్న బారామతిలో ఓటమి తప్పదని గ్రహించినట్లు ఉందని భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఎద్దేవా చేసింది. బహుశా ఆయన వద్ద ఏదైనా సమచారం ఉండి, వ్యక్తిగత అభిప్రాయం చెప్పి ఉండవచ్చని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అన్నారు. భారత్‌ బహుళ పార్టీల ప్రజాస్వామ్యంగా కొనసాగుతుందని, రెండు పార్టీల విధానం ఉండబోదని సీపీఐ అగ్రనేత డి.రాజా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img