icon icon icon
icon icon icon

అదానీ, అంబానీపైకి ఈడీని పంపండి

పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు తమ పార్టీకి టెంపోలో నల్లధనాన్ని పంపారో లేదో అన్న విషయమై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సవాలు విసిరారు.

Published : 09 May 2024 05:56 IST

ప్రధాని మోదీకి రాహుల్‌ సవాల్‌

దిల్లీ: పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు తమ పార్టీకి టెంపోలో నల్లధనాన్ని పంపారో లేదో అన్న విషయమై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సవాలు విసిరారు. ‘ఈ మధ్య అదానీ, అంబానీలను రాహుల్‌ విమర్శించడంలేదు..ఆయన పార్టీకి వారి నుంచి డబ్బులు అందాయా? ఏంటీ?’ అని ప్రధాని మోదీ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత దీటుగా స్పందించారు. ‘‘సాధారణంగా అదానీ, అంబానీల గురించి మీరు రహస్యంగానే మాట్లాడుతుంటారు. మొదటిసారి వారి గురించి బహిరంగంగా మాట్లాడారు. మోదీజీ మీరు కొద్దిగా భయపడుతున్నట్లున్నారు’’ అని రాహుల్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘‘అదానీ, అంబానీలు డబ్బులు టెంపోలో పంపిన విషయం మీకూ తెలుసు కదా. ఇది మీ స్వానుభవం కదా? భాజపా అవినీతి టెంపో డ్రైవర్‌, సహాయకుడు ఎవరనే విషయం దేశమంతటికీ తెలుసు. ఇద్దరు పారిశ్రామికవేత్తలకు మోదీ భారీగా నిధులందించారు. ఆ ధనాన్నంతా కాంగ్రెస్‌ వివిధ పథకాల కింద ప్రజలకు పంచుతుంది ’’ అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి దేశంలో 22 మంది బిలియనీర్లను సృష్టించారు..కాంగ్రెస్‌ కోట్లమంది లక్షాధికారులను తయారు చేస్తుంది అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img