icon icon icon
icon icon icon

మూడోవిడతలో 65.68% పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో మొత్తంగా 65.68% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

Published : 09 May 2024 05:58 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో మొత్తంగా 65.68% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. బుధవారం రాత్రి 10 గంటల వరకూ అందిన డేటా ఆధారంగా ఈ మేరకు ఓటింగ్‌ శాతాన్ని తాజాపరిచినట్లు తెలిపింది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి అందే వివరాలను బట్టి ఈ గణాంకాలను మళ్లీ సవరించే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంది. మూడో విడతలో భాగంగా కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 71.84%, అస్సాంలోని నాలుగు స్థానాల్లో 81.56%, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు సీట్లలో 77.53%, గోవాలో 75.20% ఓటింగ్‌ నమోదైంది.

 గుజరాత్‌లో 60.13%

గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మంగళవారం 60.13% పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 2019లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌తో పోలిస్తే ఇది 3.98% తక్కువ అని తెలిపింది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అక్కడ ఓటింగ్‌ జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img