icon icon icon
icon icon icon

72 ఏళ్లలో ముగ్గురు మహిళలే లోక్‌సభకు

హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి గత 72 సంవత్సరాలలో ముగ్గురు మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Published : 09 May 2024 06:00 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి గత 72 సంవత్సరాలలో ముగ్గురు మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ సారి కేవలం ఇద్దరు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంతవరకు లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు మహిళలు రాజకుటుంబాలకు చెందినవారే. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి. భాజపా, బీఎస్పీలు మాత్రమే మహిళలకు టికెట్లు ఇచ్చాయి. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ భాజపా అభ్యర్థిగా మండీ నుంచి పోటీచేస్తుండగా, కాంగ్రా నుంచి బీఎస్పీ అభ్యర్థిగా రేఖా రాణి పోటీచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img