icon icon icon
icon icon icon

Assembly Election Results: ‘నా ఎత్తు ఎంతో తెలిసిందా..?’ ప్రియాంకా గాంధీకి సింధియా కౌంటర్‌

Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా జోరు చూపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. 

Updated : 03 Dec 2023 16:29 IST

దిల్లీ: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా(BJP) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గతంలో చేసిన విమర్శలను దీటుగా తిప్పికొడుతున్నారు.

కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి వెళ్లిన జోత్యిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia)ను ఉద్దేశించి గతంలో కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) విమర్శలు చేశారు. ఆయన ప్రజల తీర్పును అపహాస్యం చేశారని.. అహంకారం ఎక్కువని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎత్తు గురించి ప్రస్తావించారు. దీనిపై తాజాగా సింధియా కౌంటర్ ఇచ్చారు. ‘కొంతమంది నా ఎత్తు గురించి మాట్లాడారు. ఎంత ఎత్తులో ఉన్నామో గ్వాలియర్- మాల్వా ప్రజలు చూపించారు’ అని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బదులిచ్చారు. ఈ ప్రాంతంలో సింధియా కుటుంబానికి పట్టు ఎక్కువ.

Telangana Election Results 2023: తెలంగాణ రిజల్ట్‌.. కేటీఆర్‌ రెస్పాన్స్‌

ఇంతకంటే దారుణ ఓటమి ఉంటుంది: ప్రహ్లాద్ జోషి

విపక్ష పార్టీలు పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అంతరాయం కలిగిస్తే.. ఇంతకంటే దారుణమైన ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించారు. డిసెంబర్ నాలుగు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img