icon icon icon
icon icon icon

KCR: రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్‌

తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 27 Apr 2024 16:31 IST

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో కరెంటు  పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్‌ పోయిందని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని భారాస అధినేత విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img