icon icon icon
icon icon icon

KCR: తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతోంది: కేసీఆర్‌

పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 05 May 2024 22:19 IST

జగిత్యాల: పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌షోల్‌ పాల్గొన్న ఆయన..కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ భారాస అభ్యర్థులు వినోద్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ను  పరిచయం చేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి కరవు పరిస్థితులను చూసి వరద కాల్వ పునరుజ్జీవ పథకంతో నీళ్లతో నింపితే.. ఇప్పుడు ఆ కాల్వను ఎందుకు ఎండబెడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.

జగిత్యాల జిల్లా చేసుకుంటే.. రేవంత్‌రెడ్డి తీసేస్తా అంటున్నాడు. జిల్లా కావాలా? వద్దా? రైతు బంధు వచ్చిందా.. డబ్బులు ఖాతాల్లో పడ్డాయా? కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మోసం. మభ్యపెట్టి మోసాలతో ఓట్లు దండుకున్నారు. రైతు బంధుకు 5 ఎకరాలకు సీలింగ్‌ పెడతారట..25 ఎకరాలకు పెట్టాలి. భారాస ఎంపీలు గెలిచినా ఉపయోగం ఉండదు అంటున్నారు. నలుగురు భాజపా ఎంపీలు గెలిచారు.. ఒక్క పైసా అయినా తెచ్చారా? ఇక్కడ గెలిచిన అర్వింద్‌ పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదు. మోదీ.. గోదావరి జలాలు తీసుకుపోతా అంటున్నారు.. మన జలాల గురించి భాజపా వాళ్లు కొట్లాడుతారా? దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో యువత ఆలోచించి ఓటు వేయాలి’’ అని కేసీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img