icon icon icon
icon icon icon

MP Laxman: కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు.

Updated : 20 Apr 2024 15:55 IST

హైదరాబాద్‌: వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని.. 21 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే మోదీ మేనియా స్పష్టంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. మోదీ చరిష్మాను భారాస, కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు.

‘‘20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఆలోపే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ హస్తం పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రేవంత్‌రెడ్డి అభద్రతా భావంలో ఉన్నారు. ఆయన పాలన ఓటమికి దారులు వెతుక్కుంటున్నట్లు ఉంది. కేసీఆర్, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు, అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. కేసీఆర్‌ బస్సుయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పదేళ్ల అవినీతితో విసుగు పుట్టి ఆయన్ను ఇంటికే పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెస్, భారాసలకు భవిష్యత్ లేదు’’ అని లక్ష్మణ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img