icon icon icon
icon icon icon

Lok sabha Elections: ఆసుపత్రి నుంచి వచ్చి.. ఓటేసిన నారాయణమూర్తి

Lok sabha Elections: రెండో విడత పోలింగ్‌లో భాగంగా బెంగళూరులో నారాయణమూర్తి(Narayana Murthy) దంపతులు ఓటేశారు. 

Published : 26 Apr 2024 12:09 IST

(పాత చిత్రం)

బెంగళూరు: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) రెండో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy), ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murty) బెంగళూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి ఐదేళ్లకు ఒకసారి మనకు ఈ ఓటు హక్కు వస్తుంది. ఎంతో విశ్లేషణ తర్వాత ఈ హక్కును వినియోగించుకోవాలి. ఎవరూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’’ అని నారాయణ మూర్తి ఓటర్లకు సూచించారు.

‘‘నారాయణమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్నా.. ఓటు వేసేందుకు ఇక్కడకు వచ్చారు. ఓటింగ్ తర్వాత ఆయన్ను ఇంటికి తీసుకెళ్తాం. మేం పర్యటనలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్లాన్స్‌ వేసుకున్నాం. కానీ.. వాటన్నింటికంటే ముందు ఓటు వేయడం ముఖ్యం. కూర్చొని మాటలు చెప్పే బదులు బయటకు వచ్చి, మీ హక్కును వినియోంచుకొని మీ అభిప్రాయాన్ని చెప్పండి. మాలాంటి సీనియర్లు వచ్చి క్యూలో నిల్చుంటున్నారు. యువత తప్పక రావాలి. సాధారణంగా విద్యావంతులు తక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటారు. మీ హక్కును మీరు తప్పక ఉపయోగించుకోవాలి’’ అని సుధామూర్తి పిలుపునిచ్చారు. మామూలుగా బెంగళూరులో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంటుంది. దానిని ఉద్దేశించి ఆమె స్పందించారు. వీరిద్దరు జయనగరలోని బీఈఎస్‌ కాలేజ్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img