icon icon icon
icon icon icon

Loksabha polls: పేదలు, ఆదివాసీలు, దళితులకే దేశ వనరులపై మొదటి హక్కు: అమిత్‌ షా

దేశంలోని వనరులపై మైనారిటీలకే మొదటి హక్కు అని కాంగ్రెస్ అంటే పేదలు, ఆదివాసీలు, దళితులకే ఆ హక్కు చెందుతుందని భాజపా విశ్వసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా  అన్నారు.

Published : 22 Apr 2024 17:22 IST

రాయ్‌పూర్‌: దేశంలోని వనరులపై మైనారిటీలకే మొదటి హక్కు అని కాంగ్రెస్ అంటే పేదలు, ఆదివాసీలు, దళితులకే ఆ హక్కు చెందుతుందని భాజపా విశ్వసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 

‘‘దేశంలోని వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కాని వాటిపై పేదలు, ఆదివాసీలు, దళితులు, వెనకబడినవారికి మొదటి హక్కు ఉందని మేము అంటున్నాము. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించింది. నక్సలిజం అంతరించిపోయే దశలో ఉంది. దేశవ్యాప్తంగా 123 మంది నక్సలైట్లను అరెస్టు చేశాం. మరో 250 మంది లొంగిపోయారు. వచ్చే రెండేళ్లలో మిగిలినవారు కూడా లొంగిపోవడానికి అవకాశమిస్తాం, లేదంటే వారిని కూడా అదుపులోకి తీసుకుంటాము’’ అని షా తెలిపారు. మూడోసారి మోదీని గెలిపిస్తే రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ప్రజలకు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించిన షా నాలుగు తరాల కుటుంబ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని రాహుల్‌ను ప్రశ్నించారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని విమర్శించారు. మతపరమైన సెంటిమెంట్‌ల కంటే ఓటు బ్యాంకుకే ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయాన్ని ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img