icon icon icon
icon icon icon

AAP: పార్టీ ప్రచారాలకు దూరంగా రాఘవ్ చద్దా... ఆప్‌ ఏమందంటే

ఆప్‌ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొనకపోవడంపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మంగళవారం స్పందించారు. 

Published : 30 Apr 2024 16:54 IST

దిల్లీ: ఆప్‌ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొనకపోవడంపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మంగళవారం స్పందించారు. చద్దాకు తీవ్ర కంటి సమస్య ఉండడంతో చికిత్స చేయించుకోవడానికి ఆయన లండన్ వెళ్లారని భరద్వాజ్ తెలిపారు. “చద్దా తీవ్రమైన కంటి సమస్యతో బాధ పడుతున్నారు. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఆయన కంటిచూపు కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెప్పడంతో చద్దా శస్త్రచికిత్స కోసం గత నెలలో లండన్ వెళ్లారు. త్వరలో ఆయన ప్రచారంలో పాల్గొంటారు’’ అని మంత్రి తెలిపారు.

కాగా చద్దా భార్య, నటి పరిణీతి చోప్రా నటించిన చిత్రం అమర్ సింగ్ చమ్కిలా విడుదల నేపథ్యంలో లండన్‌ నుంచి తిరిగి వచ్చారు. చద్దా దిల్లీకి రావడంలో జాప్యం చేస్తుండడంపై ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు నెలకొంటున్నాయి. ఆప్‌ ప్రచార కార్యక్రమాల్లో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలు, ప్రసంగాలను చద్దా తన సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

జైల్లో ఉన్న ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లతో పాటు ఆప్ పేర్కొన్న 40 మంది స్టార్ క్యాంపెయినర్‌లలో రాఘవ్ చద్దా ఒకరు. జాబితాలో సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img