icon icon icon
icon icon icon

Rahul Gandhi: ‘రైల్లో ప్రయాణం సామాన్యులకు శిక్ష’.. మోదీ సర్కార్‌పై రాహుల్‌ విమర్శలు

దేశంలోని రైళ్లలో ప్రయాణించడం సామాన్యులకు శిక్షలా మారిందంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. 

Published : 22 Apr 2024 00:02 IST

దిల్లీ: భారత్‌ రైల్వే వ్యవస్థను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. భాజపా పాలనలో రైళ్లలో ప్రయాణించడం సామాన్యులకు శిక్షగా మారిందన్నారు. దేశ రైల్వే వ్యవస్థ స్థితి పేలవంగా ఉందని ప్రధాని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ఆరోపించారు.

కొందరు ప్రయాణికులు రైల్లోని టాయిలెట్‌ గది, సీట్లు సరిపోక ఫ్లోర్‌పై కూర్చొని ఉన్న వీడియోను షేర్‌ చేసిన రాహుల్‌.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ ప్రధాని పరిపాలనలో రైల్లో ప్రయాణించడం సామాన్యులకు శిక్షగా మారింది. రైల్వేల పరిస్థితిపై చెడు అభిప్రాయాన్ని కలిగించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. తన స్నేహితులకు వీటిని విక్రయించేందుకు దీని సాకుగా చూపించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు.

జీతం తక్కువైనా ఐఏఎస్‌ కావాలని ఎందుకనుకుంటారో...ఓ సీఏ పోస్టు వైరల్‌

‘‘సామాన్యులు ప్రయాణించే జనరల్‌ బోగీలను తగ్గించి ఉన్నత వర్గాల రైళ్లనే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మోదీ హయాంలో ప్రతి కేటగిరి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. టికెట్లు ఉన్నప్పటికీ తమ సీట్లలో కూర్చొని ప్రయాణించలేకపోతున్నారు. సామాన్యుల సురక్షిత ప్రయాణాన్ని రక్షించుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలి’’ అని ప్రజలను కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img