icon icon icon
icon icon icon

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి స్వల్ప అస్వస్థత.. ఇండియా కూటమి ర్యాలీకి దూరం

Rahul Gandhi: రాంచీలో నేడు జరగనున్న విపక్ష ఇండియా కూటమి ర్యాలీకి అనారోగ్య కారణాలతో రాహుల్‌ గాంధీ హాజరు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

Updated : 21 Apr 2024 15:26 IST

 

దిల్లీ: నేడు రాంచీలో విపక్ష ఇండియా కూటమి (INDIA bloc) మెగా ర్యాలీ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హాజరు కావడం లేదు. ఆయన స్వల్ప అనారోగ్యానికి గురికాడమే దీనికి కారణమని పార్టీ ఆదివారం వెల్లడించింది. 

‘‘రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈరోజు సతనా, రాంచీలోని ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కానీ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో దిల్లీ నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేరు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సతనాలో జరగనున్న సభకు హాజరై ప్రసంగిస్తారు’’ అని జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

రాంచీలో జరగనున్న ఇండియా కూటమి (INDIA bloc) ర్యాలీకి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ యాదవ్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. కేజ్రీవాల్‌, సోరెన్‌ అరెస్టుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img