icon icon icon
icon icon icon

ఏపీ ఎన్నికలు.. రేపే తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టో

ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది.

Updated : 29 Apr 2024 14:25 IST

అమరావతి: ఏపీ ఎన్నికల (Andhra Pradesh Assembly Elections)కు తెదేపా-భాజపా-జనసేన కూటమి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’, ‘పన్ను బాదుడు లేని సంక్షేమం - ప్రతి ప్రాంతం అభివృద్ధే లక్ష్యం’ తదితర నినాదాలతో ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.

అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని దీని ద్వారా కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. దీనికి సంబంధించి మూడు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img