National Anthem: ఈ చిన్నారి జాతీయ గీతాలాపనకు ముగ్ధులు కావాల్సిందే!

మిలటరీ దుస్తులు ధరించి చిన్నారి ఎస్తేర్‌ హ్నామ్‌తే జాతీయ గీతాన్ని ఆలపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 30 Aug 2021 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరాంకు చెందిన ఐదేళ్ల చిన్నారి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది. మిలటరీ దుస్తులు ధరించి అద్భుతంగా జాతీయ గీతాన్ని ఆలపించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగతో  పాటు వేల మంది  ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం చిన్నారి ఆలపించిన జాతీయ గీతం వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మిజోరాంలోని లుంగ్లీలో మిలటరీ సైనికులతోపాటు అదే ప్రాంతానికి చెందిన ఎస్తేర్‌ హ్నామ్‌తే అనే ఐదేళ్ల చిన్నారి జాతీయ జెండాకు వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. దీన్ని స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) కంటే రెండు రోజుల ముందు ఆప్‌లోడ్‌ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా షేర్‌ చేశారు. విశ్రాంత ఎయిర్‌ మార్షల్‌ అధికారి అనిల్‌ చోప్రా ఈ వీడియోను షేర్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. గతేడాది ఎస్తేర్‌ వందేమాతర గీతాన్ని పాడి అందర్నీ ఆకట్టుకుంది. వీడియో చూసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారిని మెచ్చుకుంటూ ట్వీట్‌ కూడా చేశారు. కాగా, ఎస్తేర్‌ పేరు మీద 5లక్షల సబ్‌స్రైబర్స్‌తో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. దీనిలో తరచూ ఆమె వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని