గురుగ్రామ్‌లో కూలిన పైవంతెన

నిర్మాణంలో ఉన్న 6 కిలోమీటర్ల పై వంతెన కూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన..

Updated : 23 Aug 2020 10:00 IST

గురుగ్రామ్‌ : హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న పైవంతెన కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పై వంతెన కూలడంతో రహదారిపై రాకపోకలు సాగిస్తున్న కొన్ని వాహనాలు 10 మీటర్ల దూరంలో పడ్డాయని పోలీసులు తెలిపారు. ప్లైఓవర్‌ నిర్మాణంలో లోపాల కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని భావిస్తున్నారు. 
సోహ్నా రోడ్డు ప్రాజెక్టులో నిర్మిస్తున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ కూలిపోయిందని హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్తు‌ చౌతాలా ట్విట్టర్‌లో తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ, ఎస్డీఎమ్‌, సహాయక బృందాలు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 
హరియాణాలో 21.66 కిలోమీటర్ల సోహ్నా రోడ్డు ప్రాజెక్టును రెండు ప్యాకేజీలలో చేపట్టారు. అయితే, మొదటి ప్యాకేజీలో భాగంలో అండర్‌పాస్‌, సుబాష్ చౌక్ నుంచి బాద్‌షాపూర్ వైపుకు 6 కిలోమీటర్ల పైవంతెనను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2021 జులై నాటికి పూర్తి కావల్సి ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని