ప్రతి కౌలు రైతుకూ రుణం: కన్నబాబు

ప్రతి కౌలు రైతుకూ బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.

Published : 15 Jul 2020 19:23 IST

అమరావతి: ప్రతి కౌలు రైతుకూ బ్యాంకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్‌సీ) ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌలు రైతులు, పాడి రైతులు, జాలర్లకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కన్నబాబు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 7 వరకు బ్యాంకు రుణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని, కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వాలని బ్యాంకరర్లను ఆదేశించామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని