వారందర్నీ చప్పట్లతో అభినందించండి: జగన్‌

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని

Updated : 02 Oct 2020 15:10 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అభినందించాలని ఏపీ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం కలను సాధ్యం చేసే చర్యల్లో గత ఏడాది ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ విజయవంతమైందని చెప్పారు. గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను సీఎం కొనియాడారు. 

గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే అందిస్తున్నామని.. లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలందిస్తున్నట్లు వివరించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రజలంతా సాయంత్రం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో అభినందించాలని సీఎం జగన్‌ సూచించారు. తాను కూడా తన ఇంటివద్ద బయటకు వచ్చి చప్పట్లు కొడతానని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోన్న గ్రామ సచివాలయ సిబ్బందిని అందరూ అభినందించాలని సీఎం కోరారు.

ఇదీ చదవండి..

గిరిజనుల అభివృద్ధే లక్ష్యం: జగన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని