3 నెలలు.. 76 మంది చిన్నారులు

తప్పిపోయిన చిన్నారులను తల్లి ఒడికి చేర్చడానికి దిల్లీ పోలీసుశాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దిల్లీలోని సమాయ్‌పుర్‌ బద్లీ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీమా ధాకా 3 నెలల్లో 76 మంది చిన్నారులను వెతికిపట్టుకున్నారు.

Updated : 20 Nov 2020 04:55 IST

 తప్పిపోయిన చిన్నారులను ఇంటికి చేర్చిన మహిళా కానిస్టేబుల్
 పదోన్నతి కల్పించిన పోలీసుశాఖ


దిల్లీ:  తప్పిపోయిన చిన్నారులను తల్లి ఒడికి చేర్చడానికి దిల్లీ పోలీసుశాఖ ప్రవేశపెట్టిన కొత్త విధానం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దిల్లీలోని సమాయ్‌పుర్‌ బద్లీ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీమా ధాకా 3 నెలల్లో 76 మంది చిన్నారులను వెతికిపట్టుకున్నారు.  వారిలో 56 మంది పద్నాలుగేళ్ల లోపు వారే.  వీరిలో పంజాబ్‌, పశ్చిమబంగకు చెందిన చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  విధినిర్వహణలో అద్భుత ప్రతిభ కనబర్చినందుకు సీమా ధాకాకు సీనియారిటీతో సంబంధం లేకుండా పదోన్నతి కల్పిస్తున్నట్లు దిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ ట్విటర్‌లో తెలిపారు. దిల్లీలో తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టేందుకు పోలీసులకు ఆగస్టు నుంచి ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంవత్సరంలోపు ఎవరైనా 50 కంటే ఎక్కువ మంది చిన్నారులను రక్షించగలిగితే వారికి అవుట్‌ ఆఫ్‌ టర్న్‌ ప్రమోషన్‌ కింద పదోన్నతి కల్పిస్తారు. ఈ పథకం మంచి ఫలితాలను ఇస్తోందని, అంతేకాకుండా అనేక కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ పథకం ద్వారా పదోన్నతి పొందిన మొట్టమొదటి వ్యక్తి సీమాధాకా కావడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని