ఇంద్రకీలాద్రిపై 17 నుంచి దసరా మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 17 నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు.

Published : 18 Sep 2020 20:43 IST

పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 17 నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని అనుమతించాలని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిర్ణయించింది. రోజుకు కేవలం 10వేల మంది భక్తులకు పరిమితం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 దర్శనాలకు ఆన్‌లైన్‌లో ముందస్తుగా టిక్కెట్లు తీసుకున్న వారికి మాత్రమే అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తామని దేవస్థానం పేర్కొంది. 

అంతరాలయ దర్శనంతో పాటు దుర్గాఘాట్‌ వద్ద కృష్ణానదిలో స్నానం, తలనీలాల సమర్పణను కరోనా పరిస్థితుల దృష్ట్యా రద్దు చేశారు. దసరా ఉత్సవాలకు పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు అనుమతి లేదని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. ఇవాల్టి నుంచి ఆన్‌లైన్‌లో దసరా నవరాత్రుల దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. అమ్మవారి ఆలయం వద్ద కౌంటర్‌ టిక్కెట్లను పూర్తిగా నిలిపివేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా 9 రోజులపాటు వివిధ అలంకారాల్లో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని