గుడివాడలో హిందూ సంఘాల ఆందోళన

కృష్ణా జిల్లా గుడివాడలో పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గుడివాడ-బంటుమిల్లి రోడ్డులోని శ్రీనివాస్‌ సెంటర్‌లో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పోతురాజు...

Published : 12 Sep 2020 11:04 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో పలు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. గుడివాడ-బంటుమిల్లి రోడ్డులోని శ్రీనివాస్‌ సెంటర్‌లో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసి హుండీ ఎత్తుకెళ్లారు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ సంఘాల ప్రతినిధులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో చేస్తుండగా డీఎస్పీ సత్యానందం అక్కడికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విగ్రహం ధ్వంసం ఘటనలో కుట్రకోణం ఉందని హిందూ సంఘాలు డిమాండ్‌ చేయగా.. చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దనడంతో డీఎస్పీకి, హిందూ సంఘాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని