ప్రకృతికి దగ్గరగా.. ఒత్తిడికి దూరంగా!

కాలంతోపాటు వేగంగా కదలక తప్పదు.. అలా అని ఉరుకులు పరుగులుగా సమయం గడిపేస్తే...

Published : 27 Dec 2020 23:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కాలంతో పాటే మనం.. దాంతో వేగంగా కదలక తప్పదు కదా. అలా అని ఉరుకులు పెడుతూ సమయం గడిపేస్తే మనసు అస్సలు ఒప్పుకోదు. అందుకే వారాంతం వచ్చిందంటే మనసుకు నచ్చిన పనిచేస్తూ ప్రశాంతంగా గడపాలని అంతా అనుకుంటారు. తిరుపతిలోని ఓ బృందం కూడా ఇలాగే ఆలోచించింది. పని ఒత్తిడిని జయించాలంటే ఒకటే దారి. అదే ప్రకృతికి దగ్గర అవ్వడం. సరిగ్గా ఈ సూత్రాన్నే తమ లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ బృందం. వృత్తి జీవితంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా వారాంతాలను పూర్తిగా తమ అభిరుచికే కేటాయిస్తున్నారు. వైవిధ్యమైన ఫొటోలు తీస్తూ.. వాటితోనే డాక్యుమెంటరీలు చేస్తూ.. సెలవు రోజులను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని