
Updated : 23 Oct 2020 19:09 IST
వరి పంటకు నిప్పుపెట్టిన రైతులు
కామారెడ్డి: ఆశించిన మేర పంట దిగుబడి రాలేదని కామారెడ్డి జిల్లాకు చెందిన రైతులు పంటకు నిప్పు పెట్టారు. కామారెడ్డి పరిధిలోని లింగాపూర్‌కు చెందిన ఇద్దరు రైతులు వరి పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. మూడెకరాల్లోని సన్నరకం వరి సాగు లాభసాటిగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పూర్తిగా తెగుళ్లబారిన పడి దిగుబడి రావట్లేదని వెల్లడించారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.