న్యూఇయర్‌ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు

కర్ణాటకలో కొత్త సంవత్సరం వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. డ్యాన్స్‌ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది....

Published : 18 Dec 2020 14:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో నూతన సంవత్సరం వేడుకలు, విందులపై ఆంక్షలు విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లలో విందులు.. నృత్య‌ కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ దృష్ట్యా డిసెంబర్‌ 30 నుంచి నాలుగు రోజులపాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించింది. క్రిస్‌మస్‌, నూతన సంవత్సరం వేడుకల్లో ప్రజలు పాటించాల్సిన నిబంధనలు వివరిస్తూ పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వేడుకల సందర్భంగా కరచాలనం, ఆలింగనాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేడుకల్లో పర్యావరణహితమైన టపాసులను మాత్రమే కాల్చాలని వెల్లడించింది. మరికొన్ని రాష్ట్రాలు సైతం నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించాలని యోచిస్తున్నాయి.

ఇవీ చదవండి...

కరోనా: 95లక్షల మంది కోలుకున్నారు

‘కొవాగ్జిన్‌ తుదిదశ ట్రయల్స్‌కు వాలంటీర్ల లేమి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని