అన్నయ్య రాహుల్‌ నుంచి ఇవే నేర్చుకున్నా..

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్‌ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్‌ చేశారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నుంచి నేర్చుకున్న లక్షణాల్ని గుర్తుచేసుకున్నారు.......

Updated : 03 Aug 2020 15:34 IST

రక్షాబంధన్‌ సందర్భంగా ప్రియాంక గాంధీ భావోద్వేగపూరిత సందేశం

దిల్లీ: అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే రక్షా బంధన్‌ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్‌ చేశారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నుంచి నేర్చుకున్న లక్షణాల్ని గుర్తుచేసుకున్నారు. ‘‘సంతోషం.. బాధ.. ఇలా ప్రతిక్షణంలో కలిసి నడుస్తూ ప్రేమ, సత్యం, సహనం అనే లక్షణాల్ని మా అన్నయ్య నుంచే నేర్చుకున్నాను. అలాంటి సోదరుడు ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ రాహుల్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రియాంక గుర్తుచేసుకున్నారు. రాహుల్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను సందేశానికి జత చేశారు. ఈ సందర్భంగా  దేశ ప్రజలందరికీ ప్రియాంక రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా.. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. తన చెల్లి ప్రియాంకను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను జతచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని