కొవిడ్‌ వ్యాక్సిన్‌.. రేసులో 7 భారత సంస్థలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే వైరస్‌ బాధితుల సంఖ్య 1.4 కోట్లు దాటగా.. మృతుల సంఖ్య 6 లక్షలకు చేరింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌పై ఆశలే మానవజాతిని

Published : 19 Jul 2020 18:51 IST

దిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే వైరస్‌ బాధితుల సంఖ్య 1.4 కోట్లు దాటగా.. మృతుల సంఖ్య 6 లక్షలకు చేరింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌పై ఆశలే మానవజాతిని ముందుకు నడిపిస్తున్నాయి. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు వేగంగా కొనసాగుతున్నాయి. భారత్‌ నుంచి కూడా దాదాపు ఏడు సంస్థలు టీకా అభివృద్ధిలో తలమునకలయ్యాయి.

దేశీయ ఫార్మా సంస్థలైన భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌, జైడస్‌ కాడిలా, పనాసియా బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌, బయోలాజికల్‌ ఈ, మైన్వాక్స్‌ లాంటి సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాయి. 

> భారత్‌ బయోటెక్‌ తన టీకా కొవాక్జిన్‌పై ఫేజ్‌ I, ఫేజ్‌ II క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు ఇప్పటికే అనుమతి పొందింది. గత వారమే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించింది.

> సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ‘ప్రస్తుతం మేం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్న ఆస్ట్రాజెనికా ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై పనిచేస్తున్నాం. భారత్‌లో ఈ ఆగస్టులో క్లినికల్స్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తాం.’ అని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అడార్‌ పూనావాలా తెలిపారు.

> జైడస్‌ కాడిలా.. తన ZyCoV-D వ్యాక్సిన్‌పై  క్లినికల్‌ ట్రయల్స్‌ను ఏడు నెలల్లో పూర్తి చేయాలని చూస్తోంది.

> పనాసియా బయోటెక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి అమెరికాకు చెందిని రెఫానా ఇంక్‌తో కలిసి ఐర్లాండ్‌లో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జూన్‌లో ప్రకటించింది.

> నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ సంస్థ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.

> ‘బయోలాజికల్‌ ఈ’,  మైన్వాక్స్‌ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని