అక్టోబర్‌లో తెరుచుకోనున్న శిల్పారామం 

కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలలుగా మూసి ఉన్న ప్రఖ్యాత సందర్శక ప్రదేశాలు, పార్కులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

Published : 26 Sep 2020 17:02 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలలుగా మూసి ఉన్న ప్రఖ్యాత సందర్శక ప్రదేశాలు, పార్కులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పారామం అక్టోబర్‌ 2 నుంచి తెరుచుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు శిల్పారామంలోకి సందర్శకులను అనుమతించనున్నారు. పర్యాటకుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు, హైదరాబాద్‌ నగరంలోని పట్టణ అటవీ పార్కులు కూడా ఆర్నెళ్ల తర్వాత నేటి నుంచి తెరుచుకుంటాయని అధికారులు నిన్న ప్రకటించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు, ఆక్సిజన్‌ పార్కు, నారపల్లిలోని నందనవనంతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని 18 పార్కులు, ఇతర జిల్లాల్లోని 15 పార్కులను తెరవాలని అటవీశాఖ నిర్ణయించిన విషయంతెలిసిందే. అలాగే, అక్టోబర్‌ 6 (జూ దినోత్సవం) నుంచి నగరంలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కులోకి సందర్శకులను అనుమతించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని